
సంకెళ్లు ఎప్పుడు వేయవచ్చు?
ముద్దాయులకు సంకెళ్లు ఎప్పుడు వేయవచ్చు?
మనదేశంలో నిందితులకు బేడీలు వేయడం అతి సాధారణ విషయమే కానీ అది చట్టరీత్య నేరం. శిక్ష పడిన ఖైదీలకు, విచారణలో ఖైదీలకు, జైల్లో ఉన్నపుడు కోర్టుకి తీసుకెళ్లేన్నప్పుడు, ఒక జైలు నుంచి మరో జైలుకు తీసుకెళ్ళునప్పుడు, సంకెళ్లు( బంధనాలు) వేయడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఒక ముద్దాయి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఆధారాలు ఉంటే అలాంటి వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి మేజిస్ట్రేట్ ఆదేశాలు వ్రాతపూర్వకముగా అనుమతి పొందాలి. అలాగే హింసాత్మక ప్రవృత్తి కలిగిన కేసుల్లో ముద్దాయులకు సంకెళ్లు వేయమని మేజిస్ట్రేట్ ఆదేశాలు ఉంటే తప్ప సంకెళ్లు ఎట్టి పరిస్థితుల్లో వేయరాదు. ఒకవేళ ముద్దాయిగా ఉండి అనారోగ్యంతో ఏ హాస్పిటల్ నందు అయిన చికిత్స పొందుతున్న వారికి సంకెళ్లు వేయరాదు. వారెంట్ వున్న కేసుల్లో కూడా అరెస్టు చేయడానికి ప్రత్యేక అనుమతులు తీసుకొన్న తరువాత మాత్రమే సంకెళ్లు వేయాలి.
ఒక వేళ సంకెళ్ళువేస్తే కోర్టుధిక్కరణ నేరమని సుప్రీంకోర్టు సిటీజన్స్ దేమోక్రసివర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం కేసులో 1995 సం.లో స్పష్టం చేసింది. కారణాలు లేకుండా మేజిస్ట్రేట్ అనుమతి పొందుకుండా సంకెళ్లు వేస్తే పోలీసులు శిక్షార్హులు అవుతారు. వారిపై నష్టపరిహారం కూడా వేయవచ్చు. రాజ్యాంగంలోని అధికారణలు 14,19,21 ప్రకారం సంకెళ్లు వేయడం నేరము మరియూ చట్ట విరుద్ధం.
అరెస్టు సమయంలో సంకెళ్లు_వేయవచ్చా?
భారతీయ చట్టాలలో అరెస్టు అంటే ఏమిటో ఎక్కడా స్పష్టంగా చెప్పబడలేదు. ఒక వ్యక్తిని శారీరకంగా నిర్బంధించడం లేదా అతన్ని కదికలను నిలుపుదల చేయడాన్ని అరెస్టు అని అంటారు. అయితే అరెస్టు చేయడానికి ఆ వ్యక్తి నేరం చేశాడని బలమైన ఆరోపణలు ఉండాలాని సుప్రీంకోర్టు 1953 సంవత్సరంలో స్పష్టం చేసింది.
అరెస్టు యొక్క ముక్య ఉద్దేశం
1.ఆ వ్యక్తి పై ఉన్న క్రిమినల్ ఆరోపణలకు కోర్టులకు జవాబు చెప్పడానికి
2. ఆ వ్యక్తి ఏదైనా నేరం చేయకుండా నిరోధించడానికి అరెస్టు చేయవచ్చు అయితే నిన్ను అరెస్టు చేస్తున్నామని సదరు వ్యక్తి కి చెప్పవలసి వుంటుంది.
అరెస్టుల విషయంలో ఆచరించ వలసిన పద్దతులు
1. అరెస్టు చేసినప్పుడు పోలీసు అధికారులు తమపేరు హోదాగల పేరు గల బాడ్జీ లను (Name Badges) తప్పనిసరిగా ధరించాలి. మరియూ ఆ అరెస్టు లో పాల్గొన్న అధికారుల వివరాలు రిజిస్ట్రర్ నందు నమోదు చేయాలి.
2. అరెస్టు చేస్తున్న అధికారి విధిగా అరెస్టు మెమో తయారు చేసి దాని మీద సదరు వ్యక్తి యొక్క కుటుంబానికి చెందిన వారిది గాని, ఆ ప్రాంతంలో గౌరవప్రదమైన వ్యక్తిడి కానీ సంతకము తీసుకోవాలి. అదే విధం గా ఆ అరెస్టు గురించి ఆ వ్యక్తి బందువులకు గాని, స్నేహితులకు మొదలైన వారికి తెలియపరచాలి.
3. అరెస్టుగాని, నిర్బంధంగానీ చేసిన వెంటనే ఆ విషయాన్ని తమ వారికి తెలియజేకునే హక్కు పోలీసులు అరెస్టు అయిన వ్యక్తికి కల్పించాలి.
4. అరెస్టు సమాచారానికి సంబందించి ఆ సమాచారాన్ని ఎవరికి తెలియజేశారో ఆ వివరాలు మరియూ ఏ పోలీసుస్టేషన్ కి ఏ అధికారికి తెలియజేశారో ఆ వివరాలు నమోదు చేయాలి. అలాగే అరెస్టు చేయబడిన వ్యక్తిని ఎక్కడ నిర్బంధించారో ఏ పోలీసు స్టేషన్లో ఏ అధికారి పరిధిలో వుంచారో అనేది కూడా డైరీ లో తప్పనిసరిగా నమోదు చేయాలి.
5. అలాగే అరెస్టు అయిన వ్యక్తిని తప్పకుండా శారీరక పరీక్షలు చెహించాలి. అతని శరీరం మీద ఉన్న గాయాలను నమోదు చేసి దాని కాపీని అరెస్టు అయిన వ్యక్తికి కూడా ఇవ్వాలి.
6. ఆ అరెస్టుకు సంబందించిన అన్ని వివరాలు మేజిస్ట్రేట్ కి ఇవ్వాలి. అంటే కాకుండా ప్రతి జిల్లాలోని ప్రతి రాష్ట్రంలో ఉన్న పోలీసు కంట్రోల్ రూములకు ఆ అరెస్టు కు సంభందించి అన్నీ వివరాలు అందచేయాలి అలాగే ఆ వివరాలని అక్కడ నోటీసులు బోర్టులో ఉంచాలి.
7. ఒకవేళ అరెస్టు చేయబడిన వ్యక్తిని విచారించాలనుకొన్న సంధర్బం లో ఆ వ్యక్తి న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని కోరితే అప్పుడు అతని న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలి.
8. ఒకవేళ ఎవరైనా అధికారి పై మార్గదర్శకాలు పాటించకపోతే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి కొరవచ్చు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా నిలోలీ గుప్తా కేసులో గౌహతి హైకోర్టు ఉంది పోలీసుల అమానుష ప్రవర్తనను కోర్టు చూస్తూ ఊరుకోదని నిలోలీ గుప్తాకు కలిగిన నష్టాన్ని ఎలాంటి పరిహారంతో పూరించలేమని అయితే నష్టపరిహారాన్ని డబ్బు రూపంలో ఇవ్వమని ఆదేశించడం తప్ప ఇతర చర్యలు కోర్టు దగ్గర ఏవీలేవని అందుకని అతనికి 15 వేల రూపాయలు నష్టపరిహారం ప్రతివాదులు మూడు నెలల్లో చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.